22 వరకు అసెంబ్లీ సమావేశాలు..

553
speaker pocharam

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 14వ తేదీ శనివారం నుంచి 22 వరకు ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

అంతకముందు ఇవాళ ఉదయం 11:30 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.