తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం…

88
Telangana Assembly

తెలంగాణ శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశంలో జీహెచ్‌ఎంసీ సహా 4 చట్టసవరణ ముసాయిదా బిల్లులపై చర్చ జరుగనుంది. అలాగే వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగం, సీఆర్పీసీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులపైనా చర్చ చేపట్టనున్నారు.

కరోనా నేపథ్యంలో అన్నిజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక రేపు మండలి సమావేశం జరగనుంది. సభ్యులు భౌతికదూరం పాటిస్తూ కూర్చునే విధంగా సీట్లను సర్దుబాటు చేశారు.

2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా జన గణన జరగలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ రిజర్వేషన్లు, డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకోలేదు.దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.