తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం …

140
rains

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు(అక్టోబరు 13 వ తేదీన) ఉదయం 06.30 – 07.30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడ కు దగ్గరలో( Lat.17.0 deg.N మరియు Long. 82.4 deg.N) తీవ్ర వాయుగుండముగా తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 km నుండి 65 km గరిష్టంగా 75 km వేగంతో గాలులు వీచాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నర్సాపూర్ మరియు విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో తీవ్ర వాయుగుండముగా మారి తీరాన్ని దాటింది.