ఆంధ్రజ్యోతి దినపత్రికపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ జేఏసీ

316
Abn
- Advertisement -

ఆంధ్రజ్యోతి దినపత్రిక లో వచ్చిన తప్పుడు కథనాలపై జూబ్లీహిల్స్ పోలిస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అడ్వకేట్ జేఏసీ. ఇలా అవాస్తవమైన వార్తలు రాయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే నిరాదారమైన కథనాలు రాసినందున ఆంధ్రజ్యోతి దినపత్రిక పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

రామగుండం రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డుతుందనే వార్త నిరాధారం అని స్పష్టం చేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇక ఇదే అంశంపై ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు కూడా స్పందించారు. తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆంధ్రజ్యోతి పత్రికకు సూచించారు

- Advertisement -