వరుణ్ తేజ్ “వాల్మీకి” కి నుంచి దేవీ శ్రీ ప్రసాద్ అవుట్

221
Valmiki Dsp

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్  శంకర్ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా వాల్మీకి. ఈసినిమాలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. తమిళంలో భారీ విజయం సాధించిన జిగర్తాండ మూవీకి ఇది రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈమూవీ గురించి సోషల్ మీడియాలో పలు రకాల న్యూస్ లు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా మొదట పూజా హెగ్డెను తీసుకున్నారని..కానీ ఇటివలే ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఈసినిమాలో నటించనని తేల్చి చెప్పేసిందట.

దీంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు దర్శకుడు హరీష్‌ శంకర్. తాజాగా ఈప్రాజెక్ట్ లో నుంచి మరో కీలక మైన వ్యక్తి తప్పుకున్నట్లుగా ఫిలీం నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వాల్మీకి సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఓ పాట విషయంలో దర్శకుడు హరీశ్ శంకర్ కు, దేవి శ్రీ ప్రసాద్ కు మధ్య గొడవ వచ్చిందని అందుకే దేవి ఈసినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ స్ధానంలో మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సగం వరకూ షూటింగ్ జరుపుకున్న ఈమూవీ.. వీరిద్దరూ ఇచ్చిన షాక్ తో ఏం చేయాలో తెలియని పరిస్ధితిలో ఉన్నారట. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈప్రచారంపై దర్శుకుడు ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.