సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చు!

144
vehicles
- Advertisement -

రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టడమే కాదు వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. లాక్ డౌన్ ఎత్తివేయడంతో సీజ్ చేసిన వాహనాలను జరిమానాలు చెల్లించి తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. జరిమానాలు ఈపెట్టీ, ఈ-చలానా ద్వారా చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చని చెప్పారు. తీవ్రమైన కేసులను మాత్రం పోలీసులు కోర్టుకి పంపితే.. వాహనదారులకు కోర్టులోనే జరిమానా విధించడం లేదా ప్రొసీడింగ్స్ ప్రకారం జైలు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉండనుంది.

- Advertisement -