అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ రోగులకు చికిత్స..

66
nbk

ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలనే బసవతారకం ఆస్పత్రిని స్థాపించామన్నారు సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ. ఆస్పత్రి 21వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. క్యాన్సర్‌ మానసిక క్షోభను కలిగిస్తుందన్నారు.

ఆసుపత్రి 22వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని…. అనేక కారణాలతో ప్రజలు క్యాన్సర్‌ బారినపడుతున్నారని తెలిపారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు.

ప్రస్తుతం 500 పడకలతో ఆస్పత్రిలో పేదలకు వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక పరికరాలతో రోగులకు చికిత్స అందిస్తున్నామని…. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన ఆరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందించి, డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.