రూ.100 కోట్ల క్లబ్‎‎లో కాలా..

178
rajinikanth-kaala-collections

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది. మురికివాడలో సామాన్యుల కష్టాలను తీర్చే నాయకుడిగా తన ప్రతాపం చూపించారు రజనీ. జూన్ 8న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నాలుగు రోజులలోనే 100 కోట్లు రాబట్టి రజనీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. ఆస్ట్రీలియాలో నిన్నటి వరకూ 2.4 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Rajinikanth film marches to Rs 100-crore club

ఆస్ట్రీలియాలో తొలివారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ సినామాగా కాలా నిలిచింది. మొదటి సినిమాగా పద్మావత్ చిత్రం ఉంది. కబాలి చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కబాలి సినిమా కంటే అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మరోవైపు కర్ణాటకలో రిలీజ్ కాకపోవడంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిందనే చెప్పాలి.

మరోవైపు కాలా ప్రీరిలీజ్ బిజినెస్ కి నాలుగు రోజుల కలెక్షన్స్ కి పొంతన లేదని. ఇంకా భారీ మొత్తం వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే కాలాకు ఇంకా అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో కాలా థియేటర్స్ అలాగే ఉంటాయని, ఈ నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.