రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో సూర్య మూవీ!

94
surya

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు సూర్య. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాదు ఎంత రిస్క్ అయిన తీసుకునేందుకు వెనుకాడడు సూర్య. ప్రస్తుతం సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మాతగా వాడి వాసల్ సినిమా తెరకెక్కుతోంది.

జల్లి కట్టు క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్లతో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకోసం సూర్య ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారట.

ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తుండగా జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా తమిళనాట ఇప్పుడు ఈ మూవీ గురించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది.