కాళోజీ సేవలు మరువలేనివి: సీఎం కేసీఆర్

111
cm

తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా… సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.

పలకుబడుల భాషకు పట్టం కట్టాలని నినదించిన ప్రజాకవి…ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించి జీవితాంతం వారి గొంతుకగా బతికిన కాళోజీ చిరస్మరణీయులు అన్నారు సీఎం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ కృషి మరువలేనిదన్నారు. సాహిత్య, బాషా రంగాలలో కాళోజీ చేసిన సేవలు ఎన్నటికీ మారువలేనివని తెలిపారు.