సింగరేణి కార్మికులకు మేమే న్యాయం చేశాం..

224
TBGKS President Venkatrao
- Advertisement -

సింగరేణి కార్మికులకు మేమే న్యాయం చేశామన్నారు టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు. గురువారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం టీబీజీకేఎస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. కొత్త బావులు, మెడికల్ అన్ ఫిట్, నూతన నియమకాలను చేపట్టేందుకు కృషి చేశాం.. సింగరేణి కార్మికులకు అండగా ఉండేది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమే అన్నారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన సింగరేణి డేట్ లైన్ జర్నలిస్టు దేవకృష్ణకు 50వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు.

- Advertisement -