ఎస్పీ మ్యూజిక్.. సంగీత పరిశ్రమలోకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్..

148
Suresh Productions
- Advertisement -

1964లో డా. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత వారికి ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాల నిర్మాణమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు.

దశాబ్దాలుగా పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు ప‌డిన అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహించే అన్ని రకాల బడ్జెట్ల చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పుడు ‘ఎస్పీ మ్యూజిక్’ అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించి సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ‌.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – ”మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాన్ని సొంతగా సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన‌ అవసరాన్ని మేము గుర్తించాము. సురేష్ ప్రొడక్షన్స్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న ‘SP మ్యూజిక్స లేబుల్ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని.. అలాగే సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది“ అన్నారు.

- Advertisement -