బీజేపీ ప్రభుత్వానివి నీచమైన చర్యలు- మంత్రి కొప్పుల

164
- Advertisement -

తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ లక్షలాది కుటుంబాలకు వెలుగును నింపుతూ లాభాల్లో ఉన్న సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని కుట్ర పన్నడం అమానుషం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డరు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిఛాతి నీచ చర్యలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని దుయ్యబట్టారు. సింగరేణి కార్మిక కుటుంబాలతో కలిసి ఉద్యమం చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చెసినట్లు సింగరేణిని కూడా చేర్చడం దుర్మార్గం. లాభాలలో నడిచే సంస్థలను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని మంత్రి ప్రశ్నించారు.

MMDR యాక్ట్ ని తీసుకొచ్చి కేంద్రం సింగరేణికి ఉన్న హక్కులను హరిస్తుంది.. లాభాల బాటలో నడుస్తున్న బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం దారుణం.బలవంతంగా ప్రయివేటు పరం చేయాలని కుట్ర పన్నారు. సింగరేణి కార్మికులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..కొత్త బ్లాకులు తవ్వుకోవడాని పర్మిషన్ ఇవ్వకపోగా..ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ,రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాదించింది. దేశవ్యాప్తంగా ఉన్న 98 బ్లాకులను ప్రయివేటు పరం చేయాలని చూస్తుంది. బొగ్గు బ్లాకులను ప్రయివేటు పరం చేయొద్దని 2015 లో 2021 లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చి అమ్మాలని చూస్తున్నారు. 2014 సంవత్సరంలో అధికారం చేపట్టేనాటికి 4 వందల 79 లక్షల టన్నుల రవాణా చేస్తే ఈ ఏడాది 2021-22 లో 6 వందల 70 లక్షల టన్నుల రవాణా చేస్తున్నాము.

ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెంచుతున్నము..సింగరేణి లో పని చేస్తున్న ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పించాం…వందలాది కోట్ల లాభాలతో నడుస్తున్న ఈ సంస్థను అమ్మాలని చూస్తున్నది కేంద్రం. లక్షలాది కుటుంబాలకు జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ సంస్థ కోసం పోరాటం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు..దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది..కార్మిక ,పారిశ్రామిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -