నటుడు నందమూరి తారకరత్న మరణంతో అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు తారకరత్న అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో తారకరత్న భౌతికకాయానికి అంత్యక్రియలు చేయనున్నారు. కాగా, అందరికీ తారకరత్నగా పరిచయమైన ఆయనకు ఓ ముద్దుపేరు ఉంది.
ఇంతకీ ఆయన అసలు పేరు ఏమిటో తెలుసా ?, ‘ఓబులేసు’. ఇంట్లోవాళ్లు ముద్దుగా ’ఓబు’ అని పిలుస్తారట. సినిమాల్లోకి వచ్చిన సమయంలో తన పేరును తారకరత్నగా మార్చుకున్నారు. కానీ ఆ పేరే ఆయనకు కలిసి రాలేదు అంటారు. నిజంగా ఆయన ఓబుగా సినిమాల్లోకి వచ్చి ఉంటే.. ఓబు అనే పేరుతో కచ్చితంగా సక్సెస్ అయ్యి ఉండేవారని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు తారకరత్న తో చెప్పారట.
ఎంతైనా నందమూరి నటవారసుడిగా ఓబు అనే పేరుతో వచ్చినా ప్రత్యేకంగా ఉండేది. తారకరత్న కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ హీరో వస్తూ వస్తూనే ఓ రికార్టును నెలకొల్పాడు. తారకరత్న 2002లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డు మరో హీరోకి సాధ్యం కాలేదు. ఇక 2009 లో రిలీజైన అమరావతి అనే చిత్రానికి నంది అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..