వామ్మో… ధనుష్ 15 కోట్లు!

23
- Advertisement -

కాలీవుడ్ హీరో ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కొన్నేళ్ళ క్రితం దనుష్ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబట్టాయి. రీసెంట్ గా వచ్చిన తిరు సినిమా కూడా తెలుగులో సైలెంట్ గా వచ్చి హిట్ అనిపించుకుంది. ఇక తాజా ధనుష్ సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విద్య అన్నది అందరికీ సమానంగా అందాలనే సందేశంతో దనుష్ చేసిన ఈ సినిమా తెలుగులో భారీ వసూళ్ళు అందుకుంటుంది.

తమిళ్ , తెలుగు బై లింగ్వల్ గా తెరకెక్కిన ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు భాషల్లో సక్సెస్ కొట్టాడు. తెలుగులో ఇప్పటికే సినిమా 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించేలా చేస్తుంది. నిజానికి ధనుష్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ వసూళ్లు అంటే పెద్ద విషయమే. అందుకే ఇండస్ట్రీలో సార్ కలెక్షన్స్ గురించి వామ్మో అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా 36 కోట్ల గ్రాస్ తో రెండ్రోజులకే బ్రేక్ ఈవెన్ అనిపించుకుంది. ఏదేమైనా ధనుష్ కి సార్ తెలుగులో పెద్ద హిట్ అందించి కోలీవుడ్ స్టార్ మార్కెట్ అమాంతంగా పెంచేసింది. రాబోయే రెండు వారాల్లో పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు. వినరో భాగ్యము విష్ణు కథ యావరేజ్ అనిపించుకుంది. దీంతో సార్ మరో రెండు వారాల పాటు మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాతో ధనుష్ అలవోకగా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -