పెళ్ళై, తల్లి అయినా ఫుల్ డిమాండే

53
- Advertisement -

పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగడం సాధారణ విషయమేమీ కాదు. సహజంగా పెళ్లి అయిన భామలను ప్రేక్షకులు ఆదరించరు. నిర్మాతలు, దర్శకులు కూడా వారిని ఫేడ్ అవుట్ లిస్ట్ లో పడేస్తారు. ఐతే, ఈ మధ్య ట్రెండ్ మారింది. పెళ్లి అయి, తల్లి అయిన హీరోయిన్లకు మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాజల్ అగర్వాల్, ప్రణీతా సుభాష్, అలియా భట్, కరీనా కపూర్ తదితర హీరోయిన్లు ఈ కోవలోకే వస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరింది శ్రియా సరన్.

శ్రియా సరన్ పెళ్లి చేసుకుని, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత రెండేళ్లుగా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. మొత్తానికి శ్రియా సరన్ రెండో ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా సాగుతుంది. ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా వస్తోన్న కబ్జా అనే సినిమాలో శ్రియా సరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోనూ శ్రియా సరన్ కి ఛాన్స్ వచ్చింది అని టాక్ ఉంది.

అలాగే, దర్శకుడు మగిజ్ తిరుమేని డైరెక్షన్ లో అజిత్ హీరోగా రాబోతున్న సినిమాలోనూ శ్రియా సరన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ గా శ్రియా సరన్ ను ఎంపిక చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, శ్రియా సరన్ ది ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రా ?, లేక సెకండ్ లీడా ? అని చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తమ్మీద శ్రియా సరన్ కి వరుస ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి…

వచ్చే యేడాది ప్రాజెక్ట్‌ కే విడుదల

మిస్టర్ కింగ్‌ని ఎంజాయ్ చేస్తారు..

తారకరత్న చేసిన ఆ తప్పే.. కొంప ముంచిందా!

- Advertisement -