రేపు తారకరత్న అంత్యక్రియలు..

44
- Advertisement -

నటుడు నందమూరి తారకరత్న ఇకలేరు. 23 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇక బెంగళూరు నుండి కాసేపటి క్రితమే హైదరాబాద్‌కు తారకరత్న పార్థివదేహం చేరుకోగా రేపు(సోమవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నేడు ఆదివారం ఇంటివద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంత్యక్రియలు అనంతరం తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో బావ నారా లోకేష్ తో పాటు కలిసి నడవటానికి వచ్చారు తారకరత్న. పాదయాత్రలో సడెన్ గా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. వెంటనే కార్యకర్తలు, టీడీపీ నేతలు కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరుకు తరలించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -