బీజేపీతో తెలంగాణకు ప్రమాదం: సీపీఎం

14
tammiineni

తెలంగాణకు బీజేపీతో ప్రమాదం పొంచి ఉందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మీడియాతో మాట్లాడిన తమ్మినేని…బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందన్నారు.

బీజేపీ ఓటమి లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుందని…బీజేపీ ఓడిపోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని..అయితే లీకులు ఇచ్చి చెప్పేది నమ్మలేమని, లీకులు ఇచ్చి బీజేపీనీ దారిలోకి తెచ్చుకుంటున్నారా..? జనం అభిప్రాయం తెలుసుకోవాలని లీకులు ఇస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.

స్పష్టమైన విధానం ఉండాలని, టీఆర్‌ఎస్‌ పాలన అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. కేసీఆర్‌ దొర వైఖరి కొనసాగిస్తున్నారని, పోరాటం కాదు.. బ్రతిమిలాడితేనే చేస్తాం అనే వైఖరిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు.