మరింత బెటర్‌గా పుష్ప సీక్వెల్: రష్మికా

37
rashmika

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ కలెక్షన్స్‌ సాధించిన పుష్ప…సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా ఆ అంచనాలను మరింతగా పెంచేసింది రష్మికా మందన్నా.

​సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘పుష్ప-‘ గురించి కూడా మాటిచ్చేసింది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్వెల్ మరింత బెటర్ గా, బిగ్గర్ గా ఉంటుందని ప్రామిస్ చేసింది. సినిమా పట్ల అందరూ కురిపించిన ప్రేమ తమను మరింత కష్టపడేలా చేస్తుందని చెప్పుకొచ్చింది.

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. “పుష్ప పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది.. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.. పుష్ప 2 మరింత బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది!” అంటూ పోస్ట్ చేసింది.