పెళ్లి పీటలెక్కబోతున్న హీరో విశాల్..

265
vishal
- Advertisement -

ప్ర‌ముఖ సినీ న‌టుడు, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈవిష‌యాన్ని ఆయన తండ్రి ప్ర‌ముఖ నిర్మాత జీకే రెడ్డి కోలీవుడ్‌ మీడియా వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. హైద‌ర‌బాద్ కు చెందిన అనిశా అనే యువ‌తిని విశాల్ పెళ్లి చేసుకోబుతున్నాడు.

vishal

అనిశా తండ్రి హైద‌రాబాద్ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అని స‌మాచారం.పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు విశాల్ కుటుంబ స‌భ్యులు. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట.

శ‌ర‌త్ కుమార్ కూతురు సినీ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త కుమార్ విశాల్ లు పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యంపై వ‌ర‌ల‌క్ష్మీ ఇటివ‌లే క్లారీటి ఇచ్చింది. విశాల్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్రేమన‌ని త‌మపై వ‌స్తున్న వార్త‌లు వాస్త‌వం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -