ప్రభుత్వంకు నీటి ప్రణాళిక లేదు: జగదీష్ రెడ్డి

26
- Advertisement -

ప్రభుత్వం కి నీటి ప్రణాళిక లేదు.. జల విధానం తెలియదు అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…..నీళ్లు ఇవ్వాలన్నా కనీస సోయి ధ్యాసా లేదు.. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది.. డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసు సీఎం కి అన్నారు.

కమిషన్లు తో కాలం వెల్లడిస్తున్నారు….రాష్ట్రంలో 20 శాతం కమిషన్లు దండుకుంటున్నారు… స్వయంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా లు చేస్తున్నారు… కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు..కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు….. ప్రజలు ఆగ్రహం గా వున్నారు అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి…తెలంగాణ లో కమీషన్ల దందా ఆపాలి.. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లకు మాత్రమే బిల్లు లు చెల్లిస్తున్నారు.. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది…దీనిపై ఆర్ధిక మంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. శ్వేత పత్రం విడుదల చేయాలి.. ఇవి అన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతం….. ప్రాజెక్టు లాల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదు…. గోదావరి కృష్ణా లాల్లో సరిపడా నీళ్లు వున్నా ఇవ్వడం చేతకావడం లేదు పాలకులకు..ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి అన్నారు.

Also Read:జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రణాళికా

అయిన ప్రభుత్వం కి సోయి లేదు.. కరంట్ కూడా సరిగా ఇవ్వడం లేదు..2014 కంటే ముందు ఉన్న పరిస్థితి లు మళ్ళీ వచ్చాయి.. ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ లను నడపడం లేదు…గోదావరి నీళ్లు తీసుకుపోతాం అని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎం లో చలనం లేదు… తెలంగాణ మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అని మండిపడ్డారు జగదీష్ రెడ్డి.

- Advertisement -