అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని TGSWREIS కార్యదర్శి డా.అలగు వర్షిణి ఐఏఎస్ శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు . ఈ మీటింగ్ లో గురుకులాల్లో ముఖ్యంగా బాలికల్లో మరింత ధైర్యాన్ని ,మనో నిబ్బరాన్ని ,సాధికారత సాదించేందుకు , చదువుతున్నపుడు ఒత్తిడిని ఎలా జయించాలి , సమాజంలో ఒక మహిళగా ఎలాగా ఎదగాలి.. స్థిరపడాలి.. సమాజంలో మహిళా స్థానం , సమాజం కోసం చేయాల్సిన విధుల వంటి పలు అంశాలపై విశేషమైన అనుభవం వున్నా ప్రఖ్యాత ప్రముఖులతో రాష్టంలోని అన్ని గురుకుల బాలికల పాఠశాలలు ,కళాశాలలో ZOOM MEETING ద్వారా పాల్గొని ప్రముఖులతో పలు సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా చాయ్ రచన్ రిటైర్డ్ ఐ ఏ ఎస్…విద్ద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో మన ముఖంలో చిరునవ్వుతో నవ్వుతూ ఉండాలి ..ఎదో ఏమో కోల్పోయామని అనే ఫీలింగ్ మనలో మన ముఖంలో కనిపించొద్దు . ముఖంలో నవ్వు లేకపోవడం మూలాన ఇతరులు కుడా అదే రీతిగా వ్యవహరిస్తారు . మీరు సంతోషంగా నవ్వుతు ఉండడం ద్వారా ఇతరులు కుడా సంతోషంగా వుండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరి మీద మనం ఆధారపడకుండా మనంతట మనమే సాధికారతను సాదించేందుకు పట్టుదలతో ముందుకెళ్లాలి అని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకుంటే గురుకులాల్లో ఇంకా ఎంతో మెరుగైన సౌకర్యాలు వసతులు వున్నాయి . గురుకులాల్లో దేవుడి దీవెనలతో నెలకొల్పబడ్డాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేసారు. సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితం ఉన్నతంగా రాణించేలా గురుకులాలలో చదువు పూర్తయ్యేవరకు మీ లక్ష్యాన్ని ఎంచుకొని వాటిని చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోని ముందు వెళ్లాలని సూచించారు.
ప్రస్తుత సమాజంలో ఊరుకు పరుగు జీవితంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు,దీని ద్వారా అనేక వ్యాధులు వస్తున్నాయి. దీన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని మంచి కూరగాయలు ,పండ్లు మొక్కలను పెంచుకొని వాటిని భుజించడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతోందని ఆమె వివరించారు.
Also Read:కోర్ట్ మూవీపై నాని సంచలన వ్యాఖ్యలు..
ప్రీతీ సుదాన్ : చైర్మన్ UPSC మాట్లాడుతూ ….ఉమ్మడి ఆంధ్ర రాష్టంలో వున్నప్పుడు ఈ – సిగేరేట్ కంపెనీ స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఇటు పాలకులను అటు యంత్రంగాన్ని సమన్వయపరచి ఆ కంపెనీ నెలకొల్పబడకుండా చేశాను . ఒక వేళా ఆ కంపెనీ నెలకొల్పితే అంతో మంది అనారోగ్యబారిన పడి అవస్థలు పడే వారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే కష్టం ఇబ్బందులు ఉంటాయి ..కానీ దాని వెనుక దీర్ఘ కాలిక ప్రయోజనాలు ప్రజలరోగ్యాన్ని కాపాడే అవకాశం ఏర్పడిందని ఆమె తెలిపారు. మన దేశంలో “బేటి బచావో ..బేటి పడవో” ..అలాగే “ఆయుష్మాన్భవ ” లాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని దేశ ప్రజలకోసం ప్రవేశపెట్టేందుకు ఒక గొప్ప అవకాశం తనకు లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేసారు. దేశం కోసం ,ప్రజానీకం , పేద ప్రజలకోసం ఉన్నతంగా ఆలోచిస్తే మన మదిలో ఇంకా ఎన్నో మంచి ఆలోచనలు ,పథకాలు కార్యక్రమాలు పుట్టుకొస్తాయని ఒక మహిళగా నాకు ఈ రెండు పథకాలు ప్రవేశ పెట్టె గొప్ప అవకాశం లభించిందని ఆమె వివరించారు.
ప్రస్తుతం మెడికల్ సీటును సాధించాలంటే చాల కష్టంగా మారింది. నీట్ కోచింగ్ కు లక్షల రూపాయలు వాసులు చేస్తున్నారు.అలాంటిది ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలో ఎంతో చక్కటి తర్ఫీదును ఇక్కడ అధ్యాపకులు ఇస్తున్నారు. నేను కూడా గౌలిదొడ్డి కళాశాలలో విద్యాబ్యాసం చేసానని ఆమె తెలిపారు. నేను చదువుకునే రోజుల్లో కేవలం పుస్తకాలను చదివి ర్యా౦క్ సాధించామని , కానీ ఇప్పడు అనేక రకమైన మెటీరియల్ , లైబ్రరీ ,డిజిటల్ రూపంలో పూర్తి స్థాయిలో మెటీరియల్ లభిస్తుందని చెప్పారు . వీటినన్నిటిని సద్వినియోగపర్చుకొని ఉన్నతంగా జీవితంలో స్థిరపడాలని విద్యార్థినులకు ఆమె దిశా నిర్దేశం చేసారు. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయొద్దని కోరారు ఉపాధ్యాయులకు ,అలాగే తల్లిదండ్రుల పట్ల క్రమశిక్షణ తో పాటు మంచి ప్రవర్తన కల్గి ఉండాలని చెప్పారు.
Also Read:కోర్ట్ మూవీపై నాని సంచలన వ్యాఖ్యలు..

