ఆగస్టులో సబ్సిడీపై పాడిగేదెలు పంపిణీ..

215
Talasani Srinivas Yadav
- Advertisement -

ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్న పాడిగేదెల పంపిణీ కార్యక్రమం అమలులో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించారు. సోమవారం సచివాల నుండి వివిధ జిల్లాల పశుసంవర్ధక అధికారులతో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌లతో కలిసి పాడిగేదెల పంపిణీ కార్యక్రమాల విధివిధానాలపై వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు.

 Talasani Srinivas Yadav

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. విజయ డెయిరీ, ముల్కనూర్‌, మదర్‌ డెయిరీ, కరీంనగర్‌ డెయిరీలలో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మందికి సబ్సిడీపై పాడిగేదెలు, ఆవులను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రస్థాయిలో విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే జారీచేయడం జరిగిందన్నారు. కొనుకోలు ప్రాంతానికి పశుసంవర్ధక శాఖ అధికారి, డెయిరీ ప్రతినిధి, లబ్ధిదారులకు అవగాహన కల్పించే విధంగా సదస్సులను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Video Conference on Dairy Development

పంపిణీ చేసే గేదెలకు ఒకొక్క దానికి యూనిట్‌ కాస్ట్‌లో 3 సంవత్సరాల పాటు భీమా, 300 కిలోల సమీకృత దాణాను అందించడం జరుగుతున్నారు. అదనంగా 5 వేల రూపాయలను లాజిస్టిక్‌ ఖర్చుల క్రింద చెల్లించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల వాటను జిల్లా కలెక్టర్ల ఖాతాలో జమచేసే విధంగా ఆయా డెయిరీల ప్రతినిధులు చొరవ తీసుకునేలా చూడాలన్నారు. మీ అందరి సమిష్ఠి కృషితో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని, అదే స్పూర్తితో పాడిగేదెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

- Advertisement -