సెన్సార్ పూర్తి చేసుకున్న’బ్రాండ్ బాబు’..

206
- Advertisement -

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌ బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.

Brand Babu Movie

 

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో, టీజర్‌కి మంచి స్పందన రాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి..

Brand Babu Movie

నటీనటులు : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు.. సాంకేతిక విభాగం :ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి, ఆర్ట్‌: మురళి ఎస్‌.వి. దర్శకత్వం : ప్రభాకర్ పి, నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు, బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం, మ్యూజిక్: జేబి, లిరిక్స్: పూర్ణచెర్రీ, కెమెరామెన్: కార్తీక్ ఫలణి, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి, పి ఆర్ ఓ: వంశీశేఖర్.

- Advertisement -