‘సైరా’నుండి విజయ్‌ సేతుపతి ఫస్ట్‌లుక్‌..

128
Vijay Sethupathy

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో విజయ్‌ రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు విజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం మోషన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వీరుడిలా కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి లుక్‌ ఆకట్టుకుంటోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, కిచ్చ సుదీప్, తమన్నా వంటి ప్రముఖ నటులు చిత్రంలో కనిపించనున్నారు.

Vijay Sethupathi Motion Teaser | Sye Raa Narasimha Reddy | Chiranjeevi | Ram Charan | Surender Reddy