విజయ్‌ దేవరకొండ ప్రేయసితో విశాల్‌ పెళ్లి..

204
Vishal

ప్రముఖ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీస్‌లో అగ్రపథంలో దూసుకుపోతున్న విశాల్ హైదరాబాదీ అమ్మాయిని పెళ్లాతున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఆ అమ్మయి ఎవరో మాత్రం ఇంతవరకూ ఫోటోలు బయటకు రాలేదు. అయితే తాజాగా విశాల్ తనతో పాటు ఆ అమ్మయి ఫోటోని షేర్ చేశాడు.

Vishal

ప్రస్తుతం ఆ ఫోటో వెబ్ లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఎవరా అమ్మయి అనేగా మీ సందేహం? హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ ఫ్యామిలీ విజయ్ రెడ్డి- పద్మజల కుమార్తె అనీషా రెడ్డి. ఈ విషయంపై గతంలో విశాల్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే విశాల్‌ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. ‘పెళ్లిచూపులు’ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు ప్రేయసిగా నటించిన అమ్మయే. విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ అనీశా నటించారు. విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్‌ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా ఇక్కడే చేయబోతున్నట్లు పేర్కొన్నారు.