సూర్య ‘జై భీమ్’ ఫస్ట్ లుక్ అదిరింది..

108

తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘జై భీమ్’. శుక్రవారం సూర్య పుట్టినరోజు నేపథ్యంలో ‘జై భీమ్’ చిత్రం నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకుడు. ఇందులో కేరళ యువ నటి రాజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. జై భీమ్’ చిత్రంలో గిరిజన తెగల హక్కులు మరియు వారి సమస్యలపై పోరాడే పవర్ ఫుల్ అడ్వకేట్ గా సూర్య నటిస్తున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో తన కెరీర్ లోనే మొదటిసారి నల్లకోటు ధరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నారు.