‘బతుకు బస్టాండ్’ ట్రైలర్‌కు అద్భుత‌ స్పందన..

176
Bathuku Busstand
- Advertisement -

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చిత్రం ”బతుకు బస్టాండ్”. ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిత అరోరా – శృతి శెట్టి – జెన్నిఫర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కవితా రెడ్డి, కె. మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మంచి స్పందనను అందుకుంటోంది.

విడుద‌లైన ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ద‌ర్శ‌కుడు ఐఎన్ రెడ్డి తెలపగా.. కంటెంట్‌తో పాటు క‌మ‌ర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియెన్స్‌కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే రీతిన ఈ సినిమాను రూపొందించిన‌ట్లుగా నిర్మాత‌లు ఐ క‌వితా రెడ్డి, కె. మాధ‌వి అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు.

‘మౌనంగా ఉన్నానని ముని అనుకుంటున్నవేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండి ఉండొచ్చు’ అని విరాన్ చెబుతున్నాడు. చివర్లో నా చావుకు కారణం మా అమ్మానాన్నలు అని హీరో సూసైడ్ లెటర్ రాస్తుండటంతో అసలు ఈ సినిమా కథ ఎంటనే ఆసక్తి కలుగుతుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ అందించిన నేపథ్య సంగీతం.. వాస్ కమల్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

- Advertisement -