కూతురి కోసం సురేఖా వాణి ఆరాటం

22
- Advertisement -

నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే సమాజంలో ఆడవాళ్ళ పై జరిగే దాడులపై స్పందిస్తుంటుంది. అయితే, సురేఖా వాణి మీద ఎప్పుడూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక తనపై వచ్చే విమర్శకులకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. ఇటీవల కొన్ని రోజులుగా తన కూతురు సుప్రీత గురించి అనేక పోస్టులు పెడుతుంది సురేఖా వాణి. మరోవైపు సోషల్ మీడియాలో సుప్రీత మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అందాలు ఆరబోస్తూ నెట్టింట చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సుప్రీత చాలా చురుకుగా ఉంటుంది. ఐతే, సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది. ఈ నేపథ్యంలో సురేఖా వాణి కూడా దర్శకులను నిర్మాతలను ప్రత్యేకంగా కలిసి తన కూతుర్ని హీరోయిన్ గా ప్రమోట్ చేయడానికి తెగ కష్ట పడుతుందట. తెగ ఆరాట పడుతుంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ సురేఖా వాణికి కౌంటర్స్ వేశారు. అలాగే నెటిజన్లకు కూడా గట్టి కౌంటరిచ్చింది సురేఖా వాణి. .

“నా కూతురు హీరోయిన్ గా ఎందుకు చేయకూడదు. అసలు మెడకు నన్ను నా కూతుర్ని టార్గెట్ చేస్తున్నారు ?, నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, ఆకృత్యాలు చేశానా ?, సురేఖా వాణి ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకుంది అని మీరు విన్నారా ?, అసలు పదే పదే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?, నన్నెందుకు రెచ్చగొడుతున్నారు ? అంటూ సురేఖ వాణి సీరియస్ అవుతుంది. పాపం సురేఖా వాణి బాగా ఎమోషనల్ అయినట్టు ఉంది.

Also Read:Alia:అలియా లైఫ్‌ స్టైల్‌ అదిరింది

- Advertisement -