కేంద్రమాజీ మంత్రి చిదంబరంకు బెయిల్ మంజూరు

346
Chidambaram Tihar Jail
- Advertisement -

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్రమాజీ మంత్రి చిదంబరంకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. రూ. 2 లక్షల పూచీకత్తు, ఇద్దరు జమానతుపై బెయిల్‌  లభించింది . దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది.

బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఎవిడెన్స్ ను నాశనం చేయడానికి గానీ ప్రయత్నించరాదని హెచ్చరించింది. అలాగే ఈకేసుకు సంబంధించి బయట ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని షరతులు విధించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈ ఏడాది ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రాన్ని అరెస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీహార్ జైల్లోనే ఉన్నారు.

- Advertisement -