చిదంబరం జీ..కాంగ్రెస్ దుకాణాన్ని మూసేద్దామా?

293
Chidambaram sharmistha mukarji

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 స్ధానాలకు గాను 62స్ధానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగా, 8 స్ధానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అంతేకాకుండా 62స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక చిదంబరం వ్యాఖ్యలను తప్పపట్టారు ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్టా ముఖర్జీ . బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఔట్ సోర్సింగ్ చేసిందా? అని ఆమె చిదంబరంను ప్రశ్నించారు. కాని పక్షంలో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషించుకోవాల్సిన మీరు..ఆప్ విజయంపై ఎందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవడం మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chidambaram