కాంగ్రెస్ దుకాణం బంద్ చేద్దామా..?

353
chidambaram
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్‌కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కోణపు పోటీ ఉంటుందని అంతా భావించిన చివరకు వార్ వన్ సైడే అయింది. మొత్తం 70 స్ధానాల్లో 62 స్ధానాల్లో గెలిచి ఆప్ సత్తాచాటింది. ఇక ఈ నెల 16న రాంలీలా మైదానంలో మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు కేజ్రీవాల్.

ఇక ఆప్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. బుకాయింపుదారులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించినందుకు ఢిల్లీ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని… అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో సెటిలైన ప్రజలు బీజేపీ ప్రమాదకర అజెండాను తిరస్కరించారని చెప్పారు.

ఇక చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించే టాస్క్ ను కాంగ్రెస్ తీసుకుందా? మన ఘోర పరాజయం గురించి ఆందోళన చెందకుండా ఆప్ విజయంపై మనం కేరింతలు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అవును అయితే మనం దుకాణం మూసుకోవడం మంచిది అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి శర్మిష్ట ముఖర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -