హెచ్‌సీయూ కంచె గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపారు న్యాయమూర్తి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి అని తెలిపింది.
చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని తెలిపింది. చెట్లు నరకడానికి అనుమతి తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతాం అని హెచ్చరించారు జస్టిస్ గవాయ్ .వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకు వచ్చింది? చెప్పాలన్నారు.
Also Read:కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్
మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయి.. ఆ వీడియోలు కూడా మేము చూశాం అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు గవాయ్. చెట్లు కొట్టేసేముందు అనుమతి తీసుకున్నారా లేదా చెప్పాలన్నారు. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది న్యాయస్థానం.