ఓటీటీ, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై కేంద్రం స్పందన కోరింది సుప్రీం కోర్టు. పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియాలో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్ .. వాటిని కట్టడి చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు అయింది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్ మరియు ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం, ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆల్ట్ బాలాజీ, ఉల్లో డిజిటల్, మూబి, అలాగే సోషల్ మీడియా సంస్థలైన X కార్పొరేషన్, గూగుల్, మెటా ,ఆపిల్‌లకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ల తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదన వినిపించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఎటువంటి నియంత్రణ లేకుండా అభ్యంతరమైన కంటెంట్ విస్తరిస్తోందని తెలిపారు. చేశారు. ప్రముఖ జర్నలిస్టు మరియు మాజీ సమాచార కమిషనర్ ఉదయ మహూర్కర్ ప్రధాన పిటిషనరుగా ఉండగా, సంజీవ్ న్యూవర్, సుదేశ్న భటాచార్య ముఖర్జీ, శతాబ్దీ పాండే, స్వాతి గోయల్ తదితరులు ఇతర పిటిషనర్లుగా ఉన్నారు.
Also Read:ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి: కవిత
గతంలో కూడా సుప్రీం కోర్టు, రణవీర్ అల్లహబాదియా కేసు విచారణ సందర్భంగా, ఓటీటీ వేదికలు మరియు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరమైన మరియు అసభ్యమైన కంటెంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావాలని సూచించిన సంగతి తెలిసిందే.

