నోట్ల రద్దు సమర్థనియమే:సుప్రీం

42
supreme
- Advertisement -

అవినీతి అంతం చేయాలనే ఉద్దేశ్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. జస్టిస్ ఎస్‌ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నోట్ల రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి 500నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్న, వీ. సుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని కేంద్ర స‌ర్కార్ తీసుకున్నంత మాత్రాన దాన్ని త‌ప్పుప‌ట్ట‌లేమ‌ని అభిప్రాయ‌ప‌డింది. న‌లుగురు స‌భ్యులు ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించగా…. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న మాత్రం మెజారిటీకి వ్య‌తిరేంగా త‌న అభిప్రాయాల్ని ఈ తీర్పులో వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం ద్వారా కాకుండా పార్ల‌మెంట్ ద్వారా ఆ చ‌ర్య చేప‌డితే బాగుండేద‌ని జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న తెలిపారు. మెజారిటీ న్యామూర్తుల అభిప్రాయాన్ని జ‌స్టిస్ గ‌వాయి వినిపించారు.

ఆర్థిక వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకునే స‌మ‌యంలో.. చాలా సంయ‌మ‌నం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. న్యాయ ప్ర‌క్రియ‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ అభిప్రాయాలు ముడిపెట్ట‌లేమ‌న్నారు. నోట్ల ర‌ద్దు అంశంపై కేంద్రం, ఆర్బీఐ మ‌ధ్య ఆరు నెల‌ల పాటు సంప్ర‌దింపుల ప్ర‌క్రియ సాగింద‌న్నారు. నోట్ల ర‌ద్దు ప్ర‌క్రియ‌ను చేప‌ట్టే వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ ఆర్బీఐకి లేద‌ని జ‌స్టిస్ గ‌వాయి తెలిపారు. కాగా బీవీ నాగరత్న మాత్రం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26 కింద ఆర్బీఐ నోట్లను రద్దు చేయాలని అభిప్రాయపడింది. ఇది ఒక సంస్థమాత్రమే చేయాలి. కానీ ప్రభుత్వం చేయడం సరికాదు అని అభిప్రాయపడింది. అంతేకాదు భారత పార్లమెంట్‌ ద్వారా రద్దు చేస్తే బాగుండని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -