అమెరికాలో వీరయ్య జోరు

130
- Advertisement -

ఒకప్పుడు తెలుగు సీనియర్ హీరోల సినిమాలు మాస్ సెంటర్లోనే ఎక్కువగా ఆడేవి. ముఖ్యంగా అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలకు ఉండే ఆదరణ ఉండేది కాదు. అన్నిటికీ మించి అమెరికాలో ఎక్కువగా క్లాస్ సినిమాలు ఆడేవి. కానీ, ఇటీవల అక్కడ కూడా ట్రెండ్ మారింది. అమెరికాలో కూడా పక్కా మాస్ చిత్రాలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. పైగా, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా మిలియన్ డాలర్ల వసూళ్లు సులువుగానే సంపాదిస్తున్నాయి.

చిరు గత సినిమా గాడ్ ఫాదర్ పెద్ద హిట్ అయింది. ఇక ఇప్పుడు సంక్రాంతికి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సందడి మామూలుగా ఉండేలా లేదు. ప్రస్తుతం అడ్వాన్స్ టికెట్ ట్రెండ్ ని బట్టి చూస్తే ‘వాల్తేరు వీరయ్య’కే ఎక్కువగా టికెట్లు తెగుతున్నాయి. అమెరికా తెలుగోళ్లు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాపై అంత ఆసక్తి చూపుతున్నారట. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

నిజానికి వీర సింహ రెడ్డి పై కూడా బాగానే బజ్ ఉంది. కాకపోతే.. వాల్తేరు వీరయ్య పక్కా ఎంటర్ టైన్మెంట్ మూవీ కావడం.. పైగా కామెడీలో దిట్టలు అయినా మెగాస్టార్ – రవితేజ కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ మెగాస్టార్ గ్రాఫ్ కూడా ఇటీవల పెరుగుతూ వస్తోంది. ఆ స్థాయిలోనే చిరు సినిమా కోసం కష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -