టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్..

203
RR Vs SRH
- Advertisement -

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల నేపథ్యంలో సన్ రైజర్స్ కు కేన్ విలియమ్సన్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ తో నేటి మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ జట్టులోకి వచ్చారు. ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఉనద్కట్ కు విశ్రాంతి కల్పించి కార్తీక్ త్యాగికి చోటు కల్పించారు. శివమ్ దూబే స్థానంలో కొత్త కుర్రాడు అనుజ్ రావత్ ను తీసుకున్నారు.

తుది జట్లు:

Rajasthan Royals XI: J Buttler, Y Jaiswal, S Samson, A Rawat, D Miller, R Parag, R Tewatia, C Morris, K Tyagi, C Sakariya, M Rahman

Sunrisers Hyderabad XI: A Samad, J Bairstow, K Williamson, M Pandey, V Shankar, M Nabi, K Jadhav, R Khan, S Sharma, B Kumar, K Ahmed

- Advertisement -