ఇది ఊహించిన విజ‌యమే- ఎంకే స్టాలిన్

19
MK-Stalin

దేశంలో మినీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్లు లెక్కిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయాలు దాదాపు ఖాయమయ్యాయి. త‌మిళ‌నాడులో సంపూర్ణ మెజార్టీతో డీఎంకే అధికారంలోకి రాబోతోంద‌ని తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్య‌మంత్రి అవ‌డం ఖాయ‌మైపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ విజ‌యంపై స్పందించారు.

ఇది విజ‌యం ఊహించిందే అని ఆయ‌న అన్నారు. డీఎంకే చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అని స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. అయితే కొవిడ్ సంక్షోభం కార‌ణంగా కార్య‌క‌ర్త‌లు సంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాను. ప‌టాకులు లాంటివి కాల్చొద్దు అని నేను చెప్పాను. అయితే కౌంటింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర ఉన్న అంద‌రికీ చివ‌రి ఓటు లెక్కించే వ‌ర‌కూ వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశించాను అని స్టాలిన్ అన్నారు.