నాగ చైతన్య ‘థ్యాంక్ యూ’ కథ లీక్‌..!

177
Naga Chaitanya's 'Thank You

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చైతూ నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ‘థ్యాంక్ యూ’ సినిమాలోనూ నటిస్తున్నాడు చైతూ. విక్రమ్ కే కుమార్‌తో చైతూ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఇటలీలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ మధ్యే అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు చిత్ర యూనిట్. 2021 చివర్లో ఈ సినిమాను విడులద చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హీరో ఎన్నారై బిజినెస్ మెన్ గా నటిస్తున్నాడు. తన జన్మరహస్యం.. పుట్టుక మూలాల గురించి తెలుసుకుని ఇండియాకు వస్తాడు. అక్కడ తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను వెదికేందుకు ప్రయాణం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలే థ్యాంక్ యూ కథ అని తెలుస్తుంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించలేదు.