సన్నీ డియో డియో డ్యాన్స్‌..

200
Sunny Leone Item Song In Rajasekhar Garudavega Movie
- Advertisement -

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గరుడవేగ’. పూజా కుమార్‌, శ్రద్దాదాస్‌ కథానాయికలు. సన్నీ లియోని ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఎం.కోటేశ్వరరావు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.

Sunny Leone Item Song In Rajasekhar Garudavega Movie

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదాన్ని ఏరిపారేసే పాత్రలో రాజశేఖర్‌ కనిపిస్తారు. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. సన్నీ లియోనిపై తెరకెక్కించిన ‘డియో డియో’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భీమ్స్‌ స్వరపరిచిన ఈ గీతానికి విష్ణు వేద నృత్యాలు అందించారు. ఈనెలాఖరున గానీ, నవంబరు మొదటివారంలోగానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు.

- Advertisement -