మ‌ళ్లీ సెట్స్ పైకి శ‌భాష్ నాయుడు..!

74
Kamal to Finishing Sabash Naidu

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుత దృష్టి అంతా రాజకీయాలపైనే ఉంది. చీకటి రాజ్యం తర్వాత కమల్ సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు.  ‘విశ్వరూపం-2, శభాష్ నాయుడు’ సినిమాలు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. వీటికి తోడు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌ తో మరోసారి కమల్ రాబోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు పెద్ద హిట్  అయిన సంగతి తెలిసిందే. త్వరలో దీనికి సీక్వెల్‌గా  భారతీయుడు 2 రాబోతుందంటూ కోలీవుడ్‌లో వార్త పుకార్లు షికార్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయలాని భావిస్తున్నాడట కమల్. కమలహాసన్ దర్శక నిర్మాతగా ‘శభాష్ నాయుడు’ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.  విదేశాలలో కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత కమల్ ఓ ప్రమాదం కారణంగా గాయపడటం .. కోలుకోవడానికి కొంతకాలం పట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగలేదు.

ఈ పరిస్థితుల్లోనే రాజకీయాలపై కమల్ దృష్టి పెట్టడం .. ఆ దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయి. అయితే పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం జరిగేలోగా ‘శభాష్ నాయుడు’ సినిమాను పూర్తి చేసేయాలనే నిర్ణయానికి కమల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. దీని తర్వాత విశ్వరూపం-2 పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారట. చివరిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించి పుల్ స్టాప్ పెట్టాలని కమల్ చూస్తున్నాడట.