ఆ సినిమా కోసం చాలాకష్టపడ్డా!

100
sunny
- Advertisement -

ఇషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం జిన్నా. అక్టోబర్ 21న సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుని డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో మంచు విష్ణుతో కలిసి రచ్చ చేసింది సన్నీ లియోన్.

ముఖ్యంగా సినిమాలో సన్నీ వపర్ ఫుల్ రోల్ చేసింది. తన పాత్ర కోసం చాలా కష్టపడింది. అయితే సినిమా ఫ్లాప్‌గా మిగిలిన తనకు మాత్రం సంతోషంగా ఉందని తెలిపింది సన్నీ. తన పాత్ర కోసం చాలా కష్టపడ్డానని తెలిపింది. మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నటించాలి కాబట్టి.. షూటింగ్ మొదలుకావడానికి ముందే ఒక యాక్టింగ్ కోచ్‌ను పెట్టుకుని కొన్ని వారాలపాటు సైన్ లాంగ్వేజెస్‌లో శిక్షణ పొందానని తెలిపింది సన్నీ.

ప్రతి సన్నివేశం చిత్రీకరణకు ముందు ఒక గంటపాటు తాను రిహార్సిల్ చేసేదానినని సన్నీ చెప్పింది. కోన వెంకట్‌కు కూడా థాంక్స్ చెప్పాలి. ఆయనే లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -