సీఐగా ధన్‌రాజ్‌…!

32
dhanraj

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’.తాజాగా ఈ సినిమాలో సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను ప్ర‌ముఖ హీరో సందీప్ కిష‌న్‌ విడుద‌ల చేశారు. ధన్‌రాజ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గరుడవేగ దర్శకుడు అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెరకెక్కుతోంది. అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, భాను, నందు మాటలు రాశారు.