రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ‘సుందరి’ అనే టైటిల్‌తో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. వారి మరో చిత్రం ‘సూపర్ మచ్చి’ ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. కల్యాణ్‌జీ గోగన డైరెక్ట్ చేస్తోన్న ‘సుందరి’ చిత్రంలో హీరోయిన్‌గా పూర్ణ నటిస్తున్నారు. కల్యాణ్‌జీకి దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఇదివరకు ఆయన విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందిన ‘నాటకం’ చిత్రాన్ని రూపొందించారు.
గురువారం ‘సుందరి’ ప్రి లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంప్రదాయ వస్త్రధారణలో నృత్యం చేస్తున్నట్లున్న పూర్ణ కాళ్లు కనిపిస్తున్నాయి. టైటిల్ డిజైన్ ఆకర్షణీయంగా, ప్రి లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. అర్జున్ అంబటి ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు.
ఫ్యామిలీ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమా టైటిల్‌కు ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ అనే ట్యాగ్‌లైన్ జోడించారు.’సుందరి’ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారాగణం:
పూర్ణ, అర్జున్ అంబటి
సాంకేతిక బృందం:
డైరెక్టర్: కల్యాణ్‌జీ గోగన
నిర్మాత: రిజ్వాన్
సహ నిర్మాతలు: ఖుషి, కె. రాంరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శ్రీవల్లి చైతన్య
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
డీఓపీ: బాల్ రెడ్డి
ఎడిటర్: మణికాంత్
పీఆర్వో: వంశీ-శేఖర్