ఆగస్టు 13న… పూర్ణ ‘సుందరి’

156
poorna
- Advertisement -

తెలుగులో భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ అందుకున్న నటి పూర్ణ ప్రధాన పాత్రలో, అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మేంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఆదివారం చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో అర్జున్, రాకేందు మౌళి, నిర్మాత రిజ్వాన్, దర్శకుడు కళ్యాణ్ జి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఖుషి పాల్గొన్నారు.

నటుడు రాకేందు మౌళి మాట్లాడుతూ… ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా సుందరి టైటిల్ చాలా బాగుందంటూ చెబుతున్నారు. ఇక హీరోయిన్ పూర్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె ఒక చిన్నపిల్లతో సమానం. చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది , కానీ కెమెరా ముందు ఎలా చేయాలో ఎంత చేయాలో అంత అద్భుతంగా నటిస్తుంది. ఆమె టెర్రిఫిక్ పర్ఫార్మర్ అని అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏమిలేదు. ఆమె నటవిశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. ఇక నిర్మాత రిజ్వాన్ గారు.. ఓ మంచి కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మంచి కథకు సపోర్ట్ అందిస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. ఇక హీరో అర్జున్ అర్ధనారీ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆ తరువాత అయన నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఓ సాంగ్ రాసాను, ఒక పాట పాడాను. సురేష్ బొబ్బిలి అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. ఇక నాకు బ్రదర్ లాంటి వారు దర్శకుడు కళ్యాణ్.. చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు, కానీ లొకేషన్ లో చెండశాసనుడు. మేకింగ్ విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాడు. తప్పకుండా ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది. అలాగే కెమెరా మెన్ క్విక్ గన్ మురుగన్ లాంటి వ్యక్తి.. అన్ని టకాటకా చేసేస్తూ ఉంటాడు.. ఎక్కడ ఆగడు చాలా స్పీడ్ ఉన్న వ్యక్తి. అలాగే ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ సినిమాను మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ … ఈ కథను నమ్మి నిర్మాత రిజ్వాన్ గారు అందించిన సపోర్ట్ మరిచిపోలేనిది. నిజంగా ప్రొడ్యూసర్ ఇలాంటి ఎంకరేజ్ అందిస్తే తప్పకుండా మంచి అవుట్ ఫుట్ వస్తుంది. అలాగే దర్శకుడు కళ్యాణ్ గారు కల్మషం లేని వ్యక్తి, చాలా మంచి వ్యక్తి.. ఇంత మంచి సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ధన్యవాదాలు చెప్పాలి, ఇక పూర్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనతో అదరగొట్టింది. అలాగే ఖుషి గారు, ఇతర టీం అందరికి థాంక్స్ అన్నారు.ఖుషి మాట్లాడుతూ .. చాలా మంచి సినిమాతో మళ్ళీ వస్తున్నాం. పూర్ణ గారు అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమా టీం మొత్తం చాలా సపోర్ట్ అందించారు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ … నిజంగా అందరికి థాంక్స్ చెప్పాలి. కరోనా తరువాత మళ్ళీ ఇలా వచ్చి మాట్లాడడం. ఇక సుందరి గురించి చెప్పాలంటే .. ఈ కథ చెప్పగానే నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసి సినిమా మొదలెట్టాం. కళ్యాణ్ అన్నిపనులు ఫాస్ట్ గా చేసారు. ఈ సినిమాను థియటర్స్ లో విడుదల చేయాలనే ఇన్నిరోజులు ఆగాము. ఈ సినిమా తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా విడుదల అవుతుంది . అయితే తెలుగులో థియేటర్స్ లో విడుదల అవుతుంది. సినిమా బిజినెస్ చాలా బాగుంది.. తెలుగుకంటే ముందే తమిళంలో బిజినెస్ అయిపొయింది. మలయాళంలో పూర్ణ స్టార్ హీరోయిన్ కాబట్టి అక్కడ సూపర్ గా బిజినెస్ జరిగింది. ఇక హీరో అర్జున్ చాలా అద్భుతంగా నటించాడు. చాలా మంచి వ్యక్తి, అలాగే రాకేందు మౌళి ఈ ముగ్గురిని ఎన్ని సినిమాల్లో అయినా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసేస్తూ సింగల్ టెక్ లో చేస్తారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే టీజర్ తో ఆయనేమిటో తెలుస్తుంది. దర్శకుడు కళ్యాణ్ చాలా చక్కగా సినిమాను ఫినిష్ చేసారు. ఆయనతో మరో సినిమా కూడా చేయాలనీ అనుకున్నాను కానీ ఆయనకు వేరే సినిమా ఉండడంతో కుదరలేదు .. నిజంగా కరోనా తరువాత థియటర్స్ లోకి వస్తున్న సుందరిని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు .

దర్శకుడు కళ్యాణ్ జి గోగనా మాట్లాడుతూ … ఈ ట్రైలర్ లో చూపించినట్టు మీరు ఊహించిన కథ మాత్రం కచ్చితంగా ఉండదు. మరో కథ ఉంటుంది. ఓ ఇన్నోసెంట్ లేడి .. అంటే ఎదురుగా ఓ మనిషి ఉంటె సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి ఎక్స్ట్రీమ్ గా రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా కథ. ఇందులో ముఖం, కళ్ళతో మాత్రమే నటించాలి, ఒక పేజీ డైలాగ్స్ కూడా సినిమా మొత్తంలో ఉండవు.. ఈ కథ అనుకున్నప్పుడు ఎవరా అని అనుకున్నపుడు పూర్ణ మాత్రమే మాకు గుర్తొచ్చింది. మేము ఊహించినదానికంటే ఎక్కువగానే పూర్ణ చేసింది. చాలా కొత్తగా ట్రై చేసాం .. అలాగే సురేష్ బొబ్బిలిగారు .. అయన చాలా డిఫెరెంట్ పర్సన్.. వర్క్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ గా ఇస్తారు. థాంక్యూ బ్రదర్.. అలాగే రాకేందు మౌళి లేకుండా నేను సినిమా తీయలేకపోతున్నాను. అతను నాకు అలవాటైపోయాడు. అతనికోసం ఏదైనా సీన్ పెట్టాలన్న ఆలోచన ఉంటుంది. తాను చాలా అద్భుతంగా చేసాడు.. చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర తనది. అలాగే అర్జున్ ఎప్పుడు బిజీగా ఉంటాడు.. కానీ సుందరి కోసం ఎక్కువ కేర్ తీసుకుని సినిమా చేసాడు. ఇక నిర్మాత రిజ్వాన్ గారు నన్ను చాలా నమ్మాడు. అయన నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఖుషి గారిని చాలా టెన్షన్ పెట్టాను . అలాగే ఫోటోగ్రఫి బాల్రెడ్డి గారు, ఎడిటర్ అందరు నా టీం అందరికి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

హీరో అర్జున్ మాట్లాడుతూ … ఈ టీం గురించి చెప్పాలంటే .. రిజ్వాన్ గారు ఎప్పుడు నవ్వుతు ఉంటారు… మంచి పనులకు అయన ప్రోత్సహం ఉంటుంది. అలాగే పూర్ణ గారి సూపర్ యాక్టర్ అని తెలుసు.. అంతకంటే ఆమె చాలా డౌన్ టూ ఎర్త్ ఉంటూ, తోటి నటీనటులకు సపోర్ట్ అందిస్తుంది. దానివల్ల కొత్తవాణ్ణి అయినా కూడా ఆమెతో కలిసి దైర్యంగా నటించాను . అలాగే డైరెక్టర్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్ ఉన్న దర్శకుడు, ప్రతి విషయం పై క్లారిటీ ఉన్న వ్యక్తి. అలాగే రాకేందు మౌళి మల్టి టాలెంటెడ్ వ్యక్తి … సింగర్, రైటర్, మ్యూజిక్ ఇలా అన్ని రకాలుగా రాణిస్తున్నాడు. వెన్నలకంటి గారు ఎలా పేరు తెచ్చుకున్నాడో రాకేందు మౌళి కూడా భవిష్యత్తులో ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారి ఆర్ ఆర్ చూసాకా ఆయనకు ఫ్యాన్ అయ్యాను. అంత బాగా చేసాడు. అలాగే కెమెరా బల్ రెడ్డి గారు, ఎడిటర్ ఇలా మా టీం అందరు కూడా చాలా కంఫర్ట్ గా ఉంది సినిమా చేసాం. తప్పకుండా మీ అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ .. చాలా టెన్షన్ గా ఉంది .. ఎందుకంటే సుందరి సినిమా థియటర్స్ లో విడుదల అవుతుంది .. ఆగస్టు 13 అంటే ఇప్పటినుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంత కంఫర్టబుల్ గా ఈ సినిమా చేయడానికి కారణం నా టీం. ఇది నా టీమ్ కాదు ఫ్యామిలీ అని చెప్పాలి. ఇక నిర్మాతగారు నన్ను లీడ్ రోల్ లో పెట్టి ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. స్టార్ హీరోయిన్స్ రేంజ్ చేసే పాత్ర ఇది .. నేను ఇంకా ఆ రేంజ్ కి రాలేదు .. కానీ నా మీద నమ్మకంతో నిర్మాత దర్శకుడు నమ్మకం పెట్టి ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు నయనతార గారు ఇన్స్పిరేషన్ .. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది. ఇక దర్శకుడు కళ్యాణ్ గారు చాలా ప్యాషన్ తో సినిమా చేస్తారు. నిజంగా చాలా మంచి వ్యక్తి అయన. అలాగే రాకేందు మౌళి గురించి చెప్పాలంటే తాను చాలా టాలెంటెడ్ పర్సన్.. అతనితో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను, అతను నాకు టీచర్ లా అనిపించాడు. ఇక అర్జున్ గారు చాలా స్మార్ట్ .. అయన వర్క్ లో కూడా అంతే స్మార్ట్ గా ఉంటారు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా కొత్త తరహాలో ఉంటుంది .. అందరికి తప్పకుండా నచ్చేలా ఉంటుంది. మీరంతా ఈ సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

నటీనటులు : పూర్ణ, అర్జున్ అంబటి , రాకేందు మౌళి

సాంకేతిక వర్గం:
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : డి మదన్ మోహన్ రెడ్డి,
పాటలు : రాకేంద్ర మౌళి,
ఎడిటింగ్ : మణికాంత్
సంగీతం: సురేష్‌ బొబ్బిలి,
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీ వలి చైతన్య
కో ప్రొడ్యూసర్ : ఖుషి, కె రామిరెడ్డి
నిర్మాత : రిజ్వాన్
రచన, దర్శకత్వం : క‌ళ్యాణ్ జీ గోగ‌న
పిఆర్ ఓ : వంశీ శేఖర్ .

- Advertisement -