గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అద్భుత స్పందన..

126
Suchitra
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బెంగుళూరు చెందిన కాలేజ్ స్టూడెంట్ సుచిత్ర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా బాగుంది. సోషల్ మీడియాలో చూసి నా వంతు బాధ్యతగా ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అలాగే వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే.. అని తెలిపారు. మొక్కలు నటిందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాతావరణాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

- Advertisement -