గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌..

12
MLA Bajireddy Govardhan

గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాజిరెడ్డి గోవన్న మరియు జక్రాప్పల్లి జెడ్పీటీసీ పాటుకురి తనుజ శ్రీనివాస్ రెడ్డి జక్రాన్ పల్లి మండలం , నిజామాబాద్ జిల్లాలో మొక్కలు నాటారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని సినీ గేయ చంద్ర బోస్ అన్నట్టు ఒక్కరితో ప్రారంభమైన ఈ హరిత ఉద్యమానికి ఎక్కడలేని ప్రజాధారణ లభించడంలో ఎంపీ సంతోష్ కుమార్ కృషికి నిదర్శనం అన్నారు.

పిల్లలు,పెద్దలు,బీదా,ధనిక, సెలబ్రిటీలు, రాజకీయ, నాయకులు,స్టూడెంట్లు ఉపాధ్యాయులు, జన్మదిన వేడుకలు, వివాహ వేడుకలు ఇలా ప్రతి చోట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు.. మొక్కలు నాటడం మాకు కొత్త కాదు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళే చెప్పాలా అనే స్థాయి నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉంది, మొక్కలు నాటడం ముఖ్యమైన బాధ్యత అనే వరకు చేరుకుందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి భోజా నారాయణ గారు , కలిగోట్ సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి ఎంపీటీసీ జయ గిరిధర్ గౌడ్,ఉప సర్పంచ్ నాయిక రాజు, ఇతర పెద్దలు ఈ కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు.