భర్త చనిపోతే ఏం చేసిందో తెలుసా..!

323
Meri saloon
- Advertisement -

ఇల్లాలే ఇంటికి వెలుగని ఉరికే అనలేదు. నాడు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితులను అధిగమించిన మహిళ నేడు కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా మారుతోంది.అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అసహనం,అభద్రతకు గురికాకుండా తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.అలా ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు అని నిరూపించి ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్న మేరీ ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

భర్త చనిపోతే జాలితో చూసే వారు కొందరైతే హేళన చేసే వారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో అవమానాలను దిగమింతుగు పురుషాధిక్య సమాజంలో ‘నేను సైతం’ అంటూ ముందడుగు వేసింది మేరీ. పురుషులకే పరిమితమైన క్షవరం వృత్తిలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించింది.

తమిళనాడుకు చెందిన మేరీకి 2001లో షణ్ముగనాథన్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి,అమ్మాయి ఉన్నారు. ఓ సెలూన్‌ షాపును నిర్వహిస్తున్న షణ్ముగన్‌ కుటుంబాన్ని ఓ రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షణ్ముగన్‌ 9 నెలలు ఆస్పత్రికే పరిమితమయ్యాడు. ఆస్పత్రి నుండి వచ్చిన కొద్దిరోజులకే మృత్యువాత పడ్డాడు.

భర్త చనిపోయాక కుటుంబ పోషణ భారమైపోయింది. వేరే మార్గం లేక సెలూన్‌ నిర్వహించే భారాన్ని నా భుజాలకెత్తుకుంది మేరీ. కస్టమర్లకు షేవింగ్‌ చేయడం, హెయిర్‌ స్టైల్‌, డ్రై వేయడం చేస్తూ వృత్తిలో నైపుణ్యం సాధించింది. ఇప్పుడు తిరుచ్చిలో మేరీ ఫేమస్‌. సెలూన్‌ మేరీ అంటే ఎవరైనా ఆమె సెలూన్‌కు దారి చూపుతారు.

ఇద్దరు పిల్లలను బాగా చదివించి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వృత్తినే దైవంగా భావించి సేవలంది స్తున్నాను తెలిపారు మేరీ. నాలాగే భర్తను కోల్పోయిన మహిళలు ఏదో ఒక వృత్తిని ఎంచుకుని, అందులో రాణించి సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నదే నా ఆకాంక్ష అన్నారు అని చెబుతున్న మేరీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

- Advertisement -