చౌకీదారు యాడ్స్‌ ఖర్చెంతో తెలుసా..!

236
modi adds
- Advertisement -

తనను తాను చౌకీదారుగా అభివర్ణించే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు తన పబ్లిసిటీ కోసం ఇచ్చిన ఖర్చెంతో తెలిస్తే అంతా షాకవుతారు. అక్షరాలా రూ.4300 కోట్లు. 2014 ఏప్రిల్‌ నుంచి 2018 జులై వరకు 52 నెలల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది. ఆర్‌టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచారశాఖ ఇచ్చిన లెక్క ఇది.

మొత్తం మూడువేలకోట్లలో ఎలక్ట్రానిక్ మీడియా కోసం 2,374 కోట్లు, ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం 670 కోట్లు ఖర్చు చేసింది. 2014-15లో 470 కోట్లు, 2015-16లో 542 కోట్లు, 2016-17లో 614 కోట్లు, 2017-18లో 475 కోట్లు, 2018 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ వరకు 274 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార శాఖ వివరాలను తెలిపింది.  దీనిలో పేపర్ లో యాడ్స్ కోసం ఎంత వెచ్చించారో చెప్పలేదు.

మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేండ్ల కాలంలో సగటున ఏడాదికి రూ.504 కోట్ల చొప్పున పథకాల ప్రచారం కోసం ఖర్చు చేయగా మోడీ సర్కార్‌ నాలుగేళ్లలో సగటున ఏడాదికి 800 కోట్ల చొప్పున ఖర్చుచేసింది.

మోడీ ప్రభుత్వం తమ ప్రచార ప్రకటనల కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఓ ఏడాదిపాటు 4 కోట్ల 60 లక్షలమంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయవచ్చు. 20 కోట్లమందికి గ్రామీణ ఉపాధి హామీ పథకం అందించడానికి లేదా పేదలకు 60 లక్షల మరుగుదొడ్లను నిర్మించేందుకు సరిపోతుందని పలువురు చెబుతున్నారు.

- Advertisement -