గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన విద్యార్థులు..

16

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఎం మాధవి ఎస్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఈరోజు మా కళాశాల విద్యార్థులతో మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడున్న వాతావరణంలో మార్పులు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిహెచ్ లోకేశ్వరి, పి జ్యోతి, శ్వేత,సత్యవతి శైలజ, భాగ్యలక్ష్మి ,మంజుల సంఘవి ,శిరీష ,గాయత్రి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.